శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (10:10 IST)

వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుంది.. చిన్నారి ప్రాణం పోయింది..

వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక, బాగేపల్లి తాలూకా, వసంతపూర్‌కు చెందిన హనుమంతు కుటుంబం నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. 
 
హనుమంతు రెండేళ్ల కుమార్తె నయనశ్రీ ఆడుకుంటూ వేరుశెనగ విత్తనాన్ని తినేందుకు నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే పరిస్థితి విషమించడంతో కదిరి ప్రైవేట్ ఆస్పత్రి నుంచి బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రికి వచ్చిన వారిని కంటతడిపెట్టించింది.