ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 3 మే 2018 (09:38 IST)

పెళ్ళికి వచ్చి దగ్గరి బంధువుల్లా నటించి.. వధువు మెడలో తాళి కాజేశారు..

పెళ్లికి వచ్చి దగ్గరి బంధువుల్లా నటించి.. అందరినీ మభ్యపెట్టి సినీ ఫక్కీలో పెళ్లి కూతురి మెడలో నుంచి తాళిబొట్టును కాజేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. చివరికి ఆ దొంగలు పెళ్లికూతురి బంధువుల చేతిలో చిక్కారని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం కన్నారెడ్డి గ్రామంలో ఓ పెళ్లి జరుగుతుండగా.. హైదరాబాద్ నుంచి ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్ ఆ వివాహ వేడుకకు వచ్చారు. బంధువుల్లా అందరినీ పలకరిస్తూ అన్ని పనులు తామే చేస్తున్నట్లు ఫోజులు కొట్టారు. చివరకు వధువు మెడలో దండ సర్దుతూ తాళిబొట్టు చోరీ చేశారు. 
 
కొద్దిసేపటికే ఈ విషయాన్ని గుర్తించి పెళ్లి కూతురు చెప్పడంతో బంధువులంతా కలిసి దొంగల్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. కారులో పరారవుతున్న దొంగలను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.