బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:00 IST)

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు.. కన్నా లక్ష్మీనారాయణ

ముఖ్యమంత్రి జగన్ పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పు కోసం జగన్ కు ప్రజలు అధికారం ఇస్తే, రాష్ట్ర పరిస్థితిని ఇంకా దిగజార్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఒక్క మతానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ప్రజల్లోకి సంకేతాలు వెళుతున్నాయన్నారు.

తమ కార్యకర్తలకే జీతాలు ఇచ్చి వాలంటీర్లుగా పెట్టుకున్నారని ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో... "రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం చూసి ప్రజలు తెదేపాకు అవకాశం ఇచ్చారు.

అయితే ఆయన తన అనుభవాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం కోసం వాడారు. ఆర్భాటాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు చేసిన తప్పులు ఎత్తి చూపి జగన్ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజలు మంచి మార్పు కోరుకుని జగన్ కు అవకాశం ఇచ్చారు. సహకార రంగంలో ఎన్నికలు జరిపి ధైర్యం కూడా లేకపోయింది.

ఇసుక మాఫియా అరికడతామని చెప్పి కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేశారు. మీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడం పై పెట్టిన శ్రద్ధ భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు పై లేకపోయింది. జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదు.

ఇంత త్వరగా పరిపాలనపై జగన్ పట్టు కోల్పోయారు. తెదేపా వాళ్లు అరాచకాలు చేశారు కాబట్టే వాళ్లను ఓడించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యక్తులు మారటం తప్ప వ్యవస్థ అలాగే ఉంది. జన్మభూమి కమిటీల మాదిరిగా గ్రామ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమే. అవి ప్రభుత్వ ఉద్యోగాలైతే ఎందుకు రాత పరీక్ష నిర్వహించలేదు? ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదు? 
 
ప్రభుత్వంపై అదనపు భారం పడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం లేకుండా చేస్తున్నారు
. రైతులకు 12 వేల పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పి దానికి ఇపుడు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చారు. చంద్రబాబు మాదిరిగా మీరు కూడా రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

అవినీతిని భూతంలా చూపి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. ఇప్పటికీ ఇసుక దొరకడం లేదు.. ఆన్ లైన్ విధానం పని చేయటం లేదు. ప్రజలను ఇబ్బందులు పెట్టటమే పనిగా పెట్టుకున్నారు. వరదలు వస్తే నీటి నిర్వహణ చేయకుండా ముఖ్యమంత్రి అమెరికా వెళ్లారు. రాయలసీమలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రాజెక్టులు పూర్తిగా నింపటంపై దృష్టి లేదు. 
 
వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదు. సహకార రంగంలో ఎన్నికలు జరిపే ధైర్యం కూడా లేకపోయింది.  ఇసుక మాఫియా అరికడతామని చెప్పి కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరకకుండా చేశారు. మీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వటంపై పెట్టిన శ్రద్ధ... భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలపై లేకపోయింది. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చారు. 
 
చంద్రబాబు మాదిరిగా మీరు కూడా రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. అవినీతిని భూతంలా చూపి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదు. అసలు అవినీతిపరులను వదిలేసి మీ ప్రతాపం అంతా దళితులు, రేషన్ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై చూపిస్తున్నారు. 
 
మీరు కల్పించిన ఉద్యోగాల కంటే.. ఎక్కువ మందిని రోడ్డున పడేశారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వ చర్యలు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారు? రాష్ట్రంలో ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఓ మతానికి అనుకూలమనే భావన ఏర్పడింది. సెక్యులర్ దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 
 
వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత పడాలని హెచ్చరిస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఉపాధి హామీ క్రింద గత మూడు నెలల్లో 18 వందల కోట్లు కేంద్రం ఇచ్చింది. కానీ పాత బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదు. వంద రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక్కటైనా చెప్పగలరా? 
 
75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయం పారిశ్రామికీకరణకు అవరోధం. మీ అవగాహన రాహిత్యంతో రాష్ట్రం మరింత అద:పాతాళానికి పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సీన అవసరం ఉంది. గతంలో వైయస్ అధికారంలోకి వచ్చినపుడు ఇలా చేయలేదు. అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లాలి. బిజెపి నేతల నాలుకలు చీరేస్తామని కొందరు మాట్లాడుతున్నారు. మీ గురించి ప్రజలకు తెలుసే 2014లో అధికారం ఇవ్వలేదు. 
 
చంద్రబాబు అరాచకాలు చూసి మీకు అధికారం ఇస్తే... మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. దేవాలయ భూములు పంపిణీ చేయటానికి వాళ్ల తాత సొమ్ము కాదు. ఆలయాల పరిరక్షణ కోసం దాతలు ఇచ్చిన భూములు అప్పనంగా ఇస్తారా?  సదావర్తి భూములు అక్రమంగా కట్టబెట్టడితే చర్యలు తీసుకోవాలి. మా కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయి. ఈనెల 16న బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేయబోతున్నాం. బిజెపిలో చేరిన వారిని వేధిస్తున్నారు
నేను రాసిన లేఖలకు ఒక్కదానికి సమాధానం లేదు" అని అన్నారు. మార్పు కోసం జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, కాని జగన్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. జన్మభూమి కమిటీలతో అవినీతి పెరిగిందని ఆరోపణలు చేసిన వైకాపా... అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఏంటని ప్రశ్నించారు.

జీతాలు ఇచ్చుకుని తమ కార్యకర్తలనే గ్రామవలంటీర్లుగా నియంమించుకున్నారని ఆరోపించారు. జగన్ గతంలో చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా అరికడతామని చెప్పి, కొత్త పాలసీతో ఇసుకే దొరక్కుండా చేశారని మండిపడ్డారు. రాయలసీమలో తాగునీరు కూడా లేకుండా ప్రజలు నానా యాతనలు పడుతుంటే, బీభత్సంగా వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. అన్ని మతాలకు సమానంగా చూడాల్సిన ప్రభుత్వం, ఒక్క మతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి హామీ నిధుల బకాయిలను ఇచ్చినా, పాత బకాయిలను ఇంకా చెల్లించలేదని కన్నా మండిపడ్డారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ అలాగే ఉందన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 
 
ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  గండవరపు జగన్మోహన్ ప్రభాకర్, అధికారప్రతినిధి క్రోసూరు వెంకట్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.