బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (07:41 IST)

24 నుంచి ఏపీ, తెలంగాణలో కార్తీక మాస కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో నవంబరు 24 నుంచి 30 వతేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్  ఆధ్వర్యంలో  కార్తీక మాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జిల్లాకు ఒక  ఆలయాన్ని ఎంపిక చేసి అక్కడ  7 రోజుల పాటు  కార్తీక మాస విశిష్టత కు సంబంధించిన ప్రవచన కార్యక్రమాలు,  30  తేదీ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. 

27వ తేదీ మంగళ కైశిక ద్వాదశి సందర్బంగా ప్రతి జిల్లాలో ఐదు ఎస్సీ కాలనీలను ఎంపిక చేసి వారి సంప్రదాయం ప్రకారం వారి చేత  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.