1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Khammam: Former Wyra ex MLA Banoth Madanlal died of a cardiac arrest in a private hospital in Hyderabad

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూత

madanlal
భారత రాష్ట్ర సమితి నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ ఇకలేరు. ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచారు.
 
బాణోత్ మదన్ లాల్ మొదటిసారిగా 2009 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నాటి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. 
 
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయనకు భార్య, మంజుల, కుమారుడు మృగేందర్ లాల్ ఉన్నారు. కుమారుడు ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. 
తర్వాతి కథనం
COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్