శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (10:33 IST)

బాకీ వసూలు కోసం రెండేళ్ల బాలుడు కిడ్నాప్

తనకు చెల్లించాల్సిన 43 లక్షలు చెల్లించలేదని ఓ ఐరన్ వ్యాపారి కాస్త కూడా కరుణ చూపకుండా రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. విశాఖపట్నంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం గాజువాక ఆటోనగర్లో సెయిల్ స్టాక్ యార్డ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నరేశ్ కుమార్ యాదవ్, మరోవైపు ఐరన్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.
 
డాబా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన ఐరన్ వ్యాపారి ప్రజిత్ కుమార్ బిశ్వాల్ నుంచి ఇటీవల పెద్ద మొత్తంలో ఐరన్ కొనుగోలు చేశాడు. ఇందుకుగానూ ఇంకా 43 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే తనకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని విసుగు చెందిన ప్రజిత్ కుమార్ బాకీని ఎలాగైనా వసూలు చేయాలనే ఉద్దేశంతో ఓ పథకం పన్నాడు.
 
ఇందులో భాగంగా నరేశ్ రెండేళ్ల కుమారుడు మయాంక్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించాడు. పథకం ప్రకారం శనివారం మధ్యాహ్నం అద్దె కారులో భార్య చిన్ను రాణితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లిన ప్రజిత్ తాను మాత్రం కారులో కూర్చొని భార్యను మాత్రం ఇంటి లోపలికి పంపాడు. ఇదే సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న మయాంక్‌ను కారులో ఎక్కించుకొని పరారయ్యాడు.
 
అనంతరం నరేశ్‌కు ఫోన్ చేసి కుమారుడ్ని కిడ్నాప్ చేశానని తనకు ఇవ్వాల్సిన బాకీ ఇస్తే కుమారుడ్ని అప్పగిస్తానని బెదిరించడంతో నేరేశ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలో దిగిన పోలీసులు ఫోన్ నెంబరు ఆధారంగా అర్ధాత్రి తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం బాలుడ్ని కుటుంబ సభ్యులకు అప్పగంచారు. ఇందులో నలుగురిని అస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.