బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2019 (16:44 IST)

రెండు రూపాయల కోసం దారుణంగా చంపేశాడు, ఎక్కడ?

ఇద్దరి మధ్య చిన్న తగాదా కాస్త ఒక ప్రాణాన్ని బలిగొంది. కేవలం రెండు రూపాయలకు ఘర్షణ పడి చివరకు ప్రాణం తీసుకున్నారు. కాకినాడలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకకు చెందిన సాంబమూర్తి స్థానికంగా సైకిల్ పంక్చర్ షాపు నడుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సువర్ణరాజు తన స్నేహితులతో కలిసి సాంబమూర్తి సైకిల్ షాప్ వద్దకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు.
 
గాలి కొట్టించుకున్న తరువాత డబ్బులు ఇవ్వలేదు. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లిపోయాడు. దీంతో సాంబమూర్తి డబ్బులు ఇవ్వాలని సువర్ణరాజును అడిగాడు. మర్చిపోయాను.. ఇదిగో డబ్బులు అంటూ ఇవ్వబోయాడు. రెండు రూపాయలు కూడా మర్చిపోయావా అంటూ సాంబమూర్తి ఎగతాళిగా మాట్లాడాడు.
 
దీంతో సువర్ణరాజుకు కోపమొచ్చింది. సాంబమూర్తితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు సాంబమూర్తి షాపులోని ఇనుప సామాన్లు తీసుకున్న సువర్ణరాజు అతడిపై దాడికి దిగాడు. దీంతో సాంబమూర్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాకినాడ రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.