కోడెలకు గుండెపోటు

kodela sivaprasad
ఎం| Last Updated: శనివారం, 24 ఆగస్టు 2019 (10:13 IST)
ఏపీ మాజీ స్పీకర్‌ శివప్రసాదరావు శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. కాగా..కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్‌ మనోహర్‌ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు.

రాత్రి సుమారు 10.30లకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం కోడెల ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

తాజాగా కుమారుడి షోరూమ్‌లో తనిఖీలు.. అసెంబ్లీ ఫర్నీచర్‌ విషయంలో ఆరోపణలు, ఇంటిపై దాడులు ఇవన్నీ కోడెలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని సన్నిహితులు పేర్కొంటున్నారు.
దీనిపై మరింత చదవండి :