శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (22:54 IST)

ప్రతిపక్షాలకు ఏంచెయ్యాలో వాళ్ళకే అర్ధం కావడం లేదు.. కెటిఆర్ ఆగ్రహం

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలకు ఏంచెయ్యాలో వాళ్ళకే అర్ధం కావడం లేదని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ...  "జూన్ 27 నుంచి నేటి వరకు 50 లక్షల సభ్యత్వం నమోదు చేయించాం.

రేపటి నుంచి ప్రమాద బీమా అందే విధంగా చూస్తాం. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీకి  11 కోట్ల21 లక్షల రూపాయల చెక్ ని అందజేసాం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియా శీలకంగా పని చేసిన నేతలందరికి ధన్యవాదాలు.  గవర్నర్ ని కేవలం మర్యాద పూర్వకంగా కలిశాను. కాంగ్రెస్ వాళ్లు  గతంలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.

కొందరు గడ్డాలు కూడా తియ్యమని శపధాలు చేశారు. చివరికి ఏం జరిగిందో చూశాం. మేము పార్టీ నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల మీద  దృష్టి పెట్టినం. ప్రతిపక్షాలకు సమస్యలు దొరకడం లేదు. ఏంచెయ్యాలో వాళ్ళకే అర్ధం కావడం లేదు. ఎన్నికల్లోనే వారికి సమాధానం చెబుతాం" అన్నారు.