గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (20:56 IST)

కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్

కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో ఉంది తాను కాదని, టీడీపీ శ్రేణులే దానిని వైరల్ చేశారంటూ సుధీర్ ఆరోపించారు.  
 
అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వీడియోను ఫోరెన్సిక్‌కు పంపితే అన్ని నిజాలు బయట పడతాయని టీడీపీ నేత రాజు అన్నారు.
 
ఈ వీడియోని ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మహిళల భద్రత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చనని ఫైర్ అవుతున్నారు ఆ పార్టీ నేతలు . ఇలాంటి వాళ్ళకి ఓటు తోనే బుద్దిచెప్పాలని అంటున్నారు.
 
సొంతపార్టీ నేత, అందులోనూ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకుడు కావడంతో వైసీపీ నేతలు కూడా ఏం చెప్పి కవర్ చేయాలో తెలియక  సతమతం అవుతున్నారు.