సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (16:23 IST)

కర్నూలు : ఆర్టీసీ బస్సులో 14.8 కేజీల బంగారం స్వాధీనం

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో 14.8 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పంచాలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం పట్టుబడింది. 
 
తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి తనిఖీ చేయగా రాజు అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును చెక్‌పోస్ట్ పోలీసులు తనిఖీ చేశారు. దీంతో అతన్ని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో రాజు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
తన యాజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో నుంచి బంగారం తరలిస్తున్నట్లు నిందితుడు పేర్కొన్నారు. సరియైన పత్రాలు గానీ, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.