సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (11:15 IST)

విశాఖ ఏజెన్సీలో ఒకే రోజు రెండూ ప్రాంతాల్లో పిడుగుపాటు

అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్  అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 13 ఆవులు, 6 మేకలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి భీమన్న అనే గిరిజనుడుతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకువెళ్ళారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.

ఈ ఘటనతో పాటు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ సిలంగొంది అటవీ ప్రాంతంలో పిడుగు పడి 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి. ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు క‌న్నీరుమున్నీర‌వుతూ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు.