1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (11:12 IST)

థర్డ్ వేవ్ ఆందోళన వద్దు.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు

థర్డ్ వేవ్ ఆందోళన వద్దు.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు అంటున్నారు వైద్యులు. ఏం చేయాలో చూడండి మరి..

పిల్లలని రోజూ గంటైనా ఎండలో ఆడుకోనివండి.తిరగనివండి.
నువ్వులు...బెల్లం ఉండలు...వేరుశనగ చిక్కీలు...రోజూ పెట్టండి.
మొలకలు... పండ్లు...మజ్జిగ...రాగిజావ... అరటిపండ్లు బాగా అలవాటు చేయండి.
జంక్ ఫుడ్...ఆయిల్ ఫుడ్ పెట్టకండి.
ఆకుకూరలు... కూరగాయలు ఎక్కువగా తినిపించండి. వేడన్నం లో నెయ్యేసి పెట్టండి.
ఫ్రిజ్ లో పదార్థాలు పెట్టకండి.
సెల్ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళని ఒక్క గంటైనా ప్రశాంతంగా పలకరించండి.
ఇవన్నీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి.
ఏడాది గా ఇంట్లో మగ్గడం వల్ల వాళ్ళ ఇమ్యునిటీ తగ్గకుండా చూసుకోవడమే మార్గం.
కోవిడ్ ని ఎదుర్కోవడానికి... మానసికంగా చురుగ్గా ఉండటానికి సూర్యరశ్మి... వాకింగ్... జాగింగ్ ఎంతో దోహదపడతాయి.
భయంతో నాలుగు గోడల మధ్య బందీలను చేస్తే...పరిస్థితి మరింత కష్టమౌతుంది.
వీలైతే మీ స్వంతూరు లేదా ఏదైనా పల్లెటూరు తీసుకెళ్లి పదిరోజులు మట్టి లో బాగా ఆడేలా చూడండి. ఇమ్యునిటీ దానంతటదే పెరుగుతుంది మంచి వాతావరణం ఉంటే !
నీళ్ళ బిందెలో నాలుగు తులసి...పుదీనా ఆకులు వేసి అవి తాగిస్తే ఎంతో బావుంటుంది.
అప్పుడప్పుడు నిమ్మరసం తాగించండి. నేల ఉసిరి కాయలు తినిపించండి. 
పుచ్చకాయ గింజల్లో జింక్ ఉంటుంది. తినిపించండి.
మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ లు వస్తుంటాయి. సహజ సిద్ధమైన ఆహారం ఎంతో మంచిది.
వారానికో సారి పొద్దున్నే నాలుగు వేపాకులు తినిపించండి.
రోజంతా బాగా నీళ్లు తాగేలా చూడండి.
రోజూ కొంచెం తేనె తినిపించండి ఉదయాన్నే.