1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 మే 2021 (10:21 IST)

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి లేనట్లేనా?

దేశంలో మూడు నెలల నుంచి విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌.. క్రమంగా వెనుకంజ వేస్తోందా? లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలతో.. కొవిడ్‌ వ్యాప్తి నెమ్మదించిందా..? నిపుణుల అంచనాకు తగ్గట్లే మహమ్మారికి ప్రస్తుతానికి  అడ్డుకట్ట పడిందా?

కరోనా తీవ్రతను చాటే పాజిటివ్‌ రేటు పతనం, యాక్టివ్‌ కేసుల సంఖ్యను చూస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. మూడు రోజుల నుంచి 20 లక్షలపైగా పరీక్షలు చేస్తున్నా.. కేసులు 3 లక్షల లోపే ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. సెకండ్‌ వేవ్‌కు కేంద్ర స్థానాలుగా నిలిచిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు దిగి వస్తోంది. కొవిడ్‌ విరుచుకుపడిన ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 
 
గత వారం వరకు పాజిటివ్‌ రేటు తగ్గిన జిల్లాలు దేశంలో 210 ఉండగా.. ఇప్పుడది 303కు పెరిగింది. కాగా, దేశంలో తాజాగా 2,59,551 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని కేంద్రం తెలిపింది. అత్యధిక సంఖ్యలో 2.60 లక్షల పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. పాజిటివ్‌ రేటు 12.59గా ఉందని పేర్కొంది. మరోవైపు నెలలో నమోదైన అత్యల్ప కేసులు ఇవే కావడం గమనార్హం. కొత్తగా 3.57 లక్షల మంది కోలుకున్నారు. అ యితే, మరణాలు మరోసారి 4 వేలు దాటాయి. గురువారం 4,209 మంది చనిపోయారు. బ్లాక్‌ ఫంగ్‌సతో మరణాలు పెరుగుతుండటం కారణమంటున్నారు.
 
చేరికలను మించి డిశ్చార్జిలు
ఢిల్లీలో గత 50 రోజుల్లో ఎన్నడూ లేనంతగా గురువారం 3,009 కేసులే నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 4.76కు తగ్గింది. ఇక్కడ మూడు రోజుల నుంచి కేసులు 4 వేలలోపునే ఉంటున్నాయి. రెండు నెలల అనంతరం తొలిసారిగా ఆస్పత్రుల్లో చేరికలను మించి డిశ్చార్జిలు అధికంగా ఉన్నాయి. 
 
ఇక మహారాష్ట్రలో నెలన్నర క్రితం దాదాపు 30 ఉన్న పాజిటివ్‌ రేటు తాజాగా 10.6కు తగ్గింది. సెకం డ్‌ వేవ్‌ ప్రారంభమైన.. ఫిబ్రవరి నెల మధ్యలో నమోదైన పాజిటివ్‌ రేటు(9.3)కు ఇది దగ్గరగా ఉంది. రాజధాని ముంబైలో 5 దిగువకు వచ్చింది. కాగా, దే శంలో వరుసగా మూడో రోజు తమిళనాడు(3,5579) లోనే అత్యధిక కేసులొచ్చాయి. మహారాష ్ట్ర(29,911), కర్ణాటక(28,869) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
 
కేరళలో ఆదివారంతో ముగియనున్న లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ రాష్ట్రంలో 8వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది. కర్ణాటకలో లాక్‌డౌన్‌ జూన్‌ 7 వరకు పొడిగించారు. ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షల గడువు సోమవారం తో ముగియనుండగా.. 14 రోజులు పెంచారు. గోవా లో కర్ఫ్యూ 31వరకు కొనసాగనుంది. తమిళనాడు సర్కారూ ఆంక్షలను పొడిగించే యోచనలో ఉంది.