Dharma Sangrah
✕

Cyclone Arnab: తీరం దాటనున్న అర్నాబ్.. ముందస్తు జాగ్రత్త చర్యలతో అంతా సేఫ్

Written By సెల్వి
Updated: బుధవారం, 28 అక్టోబరు 2026 (09:26 IST)
Arnab cyclone
తీవ్ర తుఫాను అర్నాబ్‌కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటంటే రాబోయే గంటలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దీనితో తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
 
బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేయబడింది.
 
ఎప్పుడైనా వరదలు వచ్చే అవకాశం ఉంది. తుపాను అర్నాబ్ ప్రస్తుతం నర్సాపురానికి 30 కి.మీ దూరంలో, యానంకి 45 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే గంటలో యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. గత మూడు గంటలుగా ఈ తుపాను గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది.
 
అర్నాబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుండటంతో, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మాట్లాడుతూ, అర్నాబ్ తుపాను కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ప్రాణనష్టం సంభవించకుండా నివారించడంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Allu Arjun: రెండు లక్షల మందితో పాట్నాలో పుష్ప 2’ కార్యక్రమానికి రెండేళ్లు

Rashmika: మైసా నుంచి విలువైన బంధాన్ని సెలబ్రేట్ చేసే మెలోడీ ఏనాటి వరమో నువ్వు రిలీజ్

Schola : డ్రగ్ మాఫియా నేపథ్యంతో స్కాలర్ సినిమా ఫస్ట్ లుక్

Suman: కాంతారావుగారి మాట ప్రకారం ఆ తప్పు చేయలేదు - హీరో సుమన్

Madura Audio: నీకై పరుగిడి పార్థు, వెంకటలక్ష్మిల ప్రణయగీతం

తర్వాతి కథనం
Show comments