బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (20:11 IST)

ఆడపిల్ల పుట్టిందని భార్య చేత యాసిడ్ తాగించాడు.. చివరికి..?

ఆధునికత పెరిగినా.. మహిళలు అన్నీ రంగాల్లో రాణించినా ఆడ శిశువులను చిన్నచూపు చూసే దుర్మార్గులున్నారు. ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. ఆ కసాయి భర్త. 
 
విశాఖ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని భార్యచేత యాసిడ్ తాగించాడు కసాయి భర్త. ఆడపిల్ల పుట్టిందని బెదిరించి వాటర్ బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో అపర్ణ మంచాన పడింది. ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
భర్త గంగునాయుడు అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బంధువులు, మాదిగ రాజకీయ పోరాట సమితి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.