బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:34 IST)

ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 27ఏళ్ల వ్యక్తి మృతి

Egg fried rice
Egg fried rice
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని.. బయటి ఆహారం వర్షాకాలంలో తీసుకోవద్దని ఎన్ని నీతులు చెప్పినా.. టేస్ట్ కోసం జనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల వెంట తిరుగుతున్నారు. దీంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పట్లేదు. 
 
నిన్నటికి నిన్న షవర్మా తిని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఓ 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ కాలూరులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. ఆపై అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.