బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (15:47 IST)

గూగుల్ మ్యాపే నా భర్తను పొట్టనబెట్టుకుంది: కోర్టుకెక్కిన భార్య

google map
గూగుల్ మ్యాప్ ఆధారంగా పలువురు గమ్యస్థానాన్ని చేరుకుంటూ వుంటారు. గూగుల్ మ్యాప్‌ను నమ్మి తెలియని ప్రదేశానికి వెళ్తుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఓ మహిళ గూగుల్ మ్యాప్ తన భర్తను చంపేసిందని కోర్టుకెక్కింది. గూగుల్ మ్యాప్ చూపెట్టిన దారిలో ప్రయాణించడంతోనే తన భర్త ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడని ఆ మహిళ కోర్టులో కేసు పెట్టింది. 
 
అమెరికాలో వున్న ఉత్తర కరోలినా ప్రాంతంలో గత ఏడాది గూగుల్ మ్యాప్ చూస్తూ ఓ వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెళ్లాడు. ఆ సమయంలో కూలిపోయిన బ్రిడ్జి వుండటాన్ని గమనించేలేదు. అంతే చెరువులో ఆ వ్యక్తి పడిపోయాడు. 
 
ఇంకా చెరువులో బండితో సహా పడిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సదరు బ్రిడ్జ్ కూలిపోయి ఏడాది దాటినా గూగుల్ దాన్ని అప్డేట్ చేయలేదని.. ఈ కారణంతోనే తన భర్త ఆ మార్గంలో వెళ్లి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడని మృతురాలి భార్య కోర్టుకు ఫిర్యాదు చేసింది. 
 
తన భర్త మరణానికి గూగుల్ మ్యాపే కారణమని కోర్టులో కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ త్వరలోనే జరుగనుంది.