సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (15:19 IST)

రూ.8లక్షలు పందెం కట్టాడు.. టీడీపీ ఓడిపోయిందని పురుగుల మందు తాగేశాడు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును నమోదు చేసుకుంటుందని.. రూ.8లక్షల పందెం కట్టిన వ్యక్తి మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామానికి చెందిన కంఠంనేని వీర్రాజు (40) అనే వ్యక్తి.. తెలుగుదేశం గెలుస్తుందని ఎనిమిది లక్షల రూపాయలు పందెం కాశాడు. 
 
కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తన ఆస్తిని మొత్తం బెట్టింగ్ వేస్తానని చెప్పడం ఫలితాలకు ముందు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే నేతల బెట్టింగులు ఊపందుకున్నాయి. ఈ బెట్టింగ్‌లకే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.