బస్సులో ఎక్కిన తాగుబోతు.. లేడీ కండక్టర్ వద్ద..?
బస్సులలో కొంత మంది ప్రజలు ఇబ్బంది ఉన్నా కూడా వారి పనుల కోసం వేరేదారి లేక దానిలో ప్రయాణిస్తుంటారు. స్త్రీల విషయంలో అసలు చెప్పనక్కర్లేదు. ఒక తాగుబోతు బస్సులోకి ఎక్కి ఆడవారిని ఇబ్బంది పెట్డాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ ఏరియాకు చెందిన 48 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్, సికింద్రాబాద్, బాలాపూర్ వైపు వెళ్తున్న మిథానీ డిపోకు చెందిన బస్సు ఎక్కాడు.
ఫుల్లుగా తాగి ఉండటంతో ఒల్లు తెలియక లేడీస్ సీట్‌లో కూర్చున్నాడు, వెనుక జనరల్ సీట్‌లో కూర్చోవాలని లేడి కండక్టర్ సూచించడంతో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు, దానితో ఆగ్రహం చెందిన పలువురు స్త్రీలు అతడిని మందలించారు, దానికి ఆవేశంతో కోపోద్రీక్తుడైన శీనివాస్‌గౌడ్ వారిని కూడా దూషించాడు, అతని దుష్ప్రవర్తన తారాస్థాయికి చేరుకోవడంతో డ్రైవర్ బస్సును పోలీసు స్టేషన్ వద్ద ఆపాడు.
అతడిని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసారు. శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని మెట్రో పాలిటిన్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు.
మద్యం తాగి బస్సు ఎక్కినందుకు గానూ, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గానూ కోర్టు శ్రీనివాస్ గౌడ్‌కు మూడు రోజులు జైలు శిక్ష మరియు 100 రూపాయల జరిమానా కూడా విధించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలపై జరిగే అఘాయిత్యాలను నిరోధించాలనే ఉద్దేశంతోనే ఉమెన్స్ సెక్షన్‌ను, జనరల్ సెక్షన్‌ను విడదీసి వేరు చేసిన సంగతి తెలిసిందే.