తొలి భార్యను చంపేసిన భర్త.. గొడవలే కారణమా..? హత్య చేసి.. మృతదేహాన్ని తగులబెట్టేశాడా?
పెళ్లైన 20 ఏళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. తన మొదటి భార్యతో గొడవ పడుతూ ఆమెను దారుణంగా హత్య చేసి బొంతపాడు శివారులో మృతదేహాన్ని తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బద్రి రాఘవయ్య(45), కల్యాణ
పెళ్లైన 20 ఏళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. తన మొదటి భార్యతో గొడవ పడుతూ ఆమెను దారుణంగా హత్య చేసి బొంతపాడు శివారులో మృతదేహాన్ని తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బద్రి రాఘవయ్య(45), కల్యాణి (43) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కల్యాణి ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోంది. అయితే కొన్నేళ్ల క్రితం రాఘవయ్య మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న కల్యాణి ఆయన్ని నిలదీసింది. ఆమె విషయమై కొన్ని నెలలుగా వారిద్దరు గొడవ పడుతున్నారు. కాగా, రెండో భార్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. కొన్ని రోజుల క్రితం రాఘవయ్య కూడా అనారోగ్యానికి గురయ్యాడు.
కల్యాణి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించింది. అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. అనంతరం కల్యాణి కనిపించకుండా పోయింది. దీంతో తన తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాస్(16) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.