బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (09:38 IST)

ఫ్యామిలీకే చేయనివాడికి కాదు, అందరినీ కలుపుకుపోయేవాడికి ఓటెయ్యండి: మంచు మనోజ్

Manchu Manoj
మంచు మనోజ్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్వితీయ పుత్రుడు. ఈయన కూడా మోహన్ బాబు గారు ఎలా మొహమాటం లేకుండా మాట్లాడుతారో అలాగే మాట్లాడేస్తుంటారు. తాజాగా జరిగిన ఈవెంట్లో మోహన్ బాబు, మోహన్ లాల్ ఎదురుగా వుండగా మంచు మనోజ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
 
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అందరూ ఆలోచన చేయండి. ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలన్నదానిపై. ఎనలైజ్ చేయండి. ఎవరు మంచివారో వారికే ఓటు వేయండి. కొందరుంటారు... ఫ్యామిలీనే పట్టించుకోరు. స్వార్థప్రయోజనాలకే విలువిస్తారు. అలా కుటుంబ సభ్యులకే ఏమీ చేయలేనివారు ఇక ప్రజలకు ఏం చేస్తారు.
 
కనుక అలాంటివారికి కాకుండా అందరినీ కలుపుకుపోయేవారు ఎవరో చూడండి. భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తున్నవారు ఎవరో చూడండి. డబ్బులున్నవారు ఓటుకి డబ్బులిస్తే థ్యాంక్స్ చెప్పండి. అంతేకానీ... అభివృద్ధి కోసం పాటుపడాలనే తపన వున్నవారిని పక్కనపెట్టకండి. అందుకే నేను చెప్పేది ఒక్కటే... ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా మీరు మాత్రం నచ్చిన వ్యక్తికే ఓటు వేయండి అని మంచు మనోజ్ సలహా ఇచ్చారు.