గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (16:17 IST)

మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది యువతుల అరెస్టు

gilrs arrested
భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఓ ఇంటిలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహుకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ మసాజ్ సెంటరులో వ్యభిచార వృత్తిలో ఉన్న ఏడుగురు యువతులను పోలీసులు అరెస్టు చేశాడు. అలాగే, ఓ విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు భీమవరం డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం చౌక్‌లో ఝాన్సీ, పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన రాహుల్ అనే ఇద్దరు కలిసి స్పా సెంటరును స్థాపించారు. ఇక్కడ స్పా ముసుగులో పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో కష్టమర్లుగా స్పా సెంటరుకు వెళ్లిన పోలీసులు.. ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఝాన్సీ లక్ష్మి అలియాస్ నందినితోపాటు ఒక విటుడిని కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.31500 నగదు, చెక్ బుక్, స్వైపింగ్ మిషన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.