మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (11:02 IST)

మంత్రి మల్లారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ విచారణకు ఐటీ లేఖ

malla reddy
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చుట్టూత ఆదాయపన్ను శాఖ అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. ఆయనకు చెందిన గృహాలు, కార్యాలయాల్లో రెండు రోజులు పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.18 కోట్ల మేరకు నగదు, 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 16 మందికి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. 
 
మరోవైపు, ఐటీ అధికారుల దాడి ఘటనతో పాటు ల్యాప్ టాప్ వ్యవహారాన్ని ఐటీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నిర్వహించిన సోదాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాయనున్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు బహిర్గతం కావాలంటే ఈడీ దర్యాప్తు చేయాలని ఐటీ శాఖ గట్టిగా భావిస్తుంది. ఇదే జరిగితే మల్లారెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకోవడం తథ్యంగా కనిపిస్తుంది.