గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:53 IST)

వల్లభనేని వంశీ - దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

avinash - vamsi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత దేవినేని అవినాశ్ ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన టీడీపీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేశారు. అలాగే, దేవినేని అవినాశ్ కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత టీడీపీ, ఇపుడు వైకాపాలో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఐటీ అధికారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ఇద్దరి నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఐటీ అధికారులు సోదాలకు రావడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ సోదాల వెనుక కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ నగరంలోని వంశీరామ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వీరు పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో ఈ సోదాలు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ తనీఖీలు పూర్తయితేగానీ అసలు గుట్టు తెలిసే అవకాశంలేకపోలేదు. ప్రస్తుతం ఈ సోదాలు అధికార వైకాపాలో కలకలం రేపుతున్నాయి.