సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (10:39 IST)

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం: 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం

fire
విజయవాడలోని బెంజ్ సర్కిల్ కి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 300 ద్విచక్రవాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. టీవీఎస్ వాహనాల షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
 
గురువారం తెల్లవారు జామున ఈ షోరూములోని మొదటి అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. ఐతే షోరూంలో భారీగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వుండటంతో అగ్ని దావానలంలా వ్యాపించి షోరూంలోని వాహనాలన్నింటిని దగ్ధం చేసినట్లు చెపుతున్నారు.
 
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఐతే అప్పటికే చాలావరకూ వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.