శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (09:28 IST)

తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని సూసైడ్...

తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గీతిక బలవ

తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గీతిక బలవన్మరణం చెందింది. ఆమె మరణానికి కారణాలు తెలియడం రావడం లేదు. ఈ ఘటన మిగిలిన వైద్య విద్యార్థులను కలవరపాటుకు గురిచేసింది.
 
వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్‌ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.