గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (10:53 IST)

ఐదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం ఇచ్చారు : మంత్రి అంబటి

ambati rambabu
తమను ఐదేళ్లపాటు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 
 
ఆయన శనివారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, 'ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత మంది కలిసి వచ్చినా వైకాపానే అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
 
అంతేకాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి’ అని పేర్కొన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని తెలిపారు. చిరంజీవి సినిమాలతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఉన్నారని, ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని పేర్కొన్నారు.