గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 19 నవంబరు 2021 (20:02 IST)

కుప్పం కోట బద్దలైంది, ఇక బాబును ఓడించడమే మిగిలింది... ఎవరు?

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత వైసిపి టార్గెట్ చంద్రబాబును ఓడించడం. ఎమ్మెల్యేగా చంద్రబాబును ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే సరైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని నిలిపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో రైల్వేకోడూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.

 
మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి. రాజకీయ పాఠాలను మంత్రే నేర్పించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై నిలబెట్టి ఓడించాలన్నదే పెద్దిరెడ్డి స్కెచ్. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పటికే ఇందుకు సిద్థమయ్యారట. చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలన్న ప్లాన్ లో ముందుకు వెళుతున్నారట. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది.