సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (17:00 IST)

ఆర్టీసీకి ప్రైవేట్ బంకుల్లో ఇంధనమే మేలు - మంత్రి పేర్ని నాని

ఏపీ ఆర్టీసీకి ప్రైవేట్ బంకుల్లో ఇంధనమే మేలంటూ మంత్రి పేర్ని నాని అన్నారు. "ఆర్టీసీ బస్సుల కోసం నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడాల్సి వస్తుంది. కేంద్రం నుంచి కొనే ఆయిల్ ధరల్లో మార్పులు రావడంతో 15 రూపాయల వరకూ అధికంగా భరించాల్సి వస్తుంది. దాంతో పోల్చి చూస్తే బయటి ధరల్లోనే ఆయిల్ ధర తక్కువగా ఉంది. 
 
అందుకే బయట బంకుల్ల కొనాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. తద్వారా ఇప్పటికే కోటిన్నర వరకూ ప్రభుత్వానికి మిగిలింది. ఇలా కేంద్రం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33కోట్ల 83లక్షల వరకూ మిగలొచ్చని అంచనా.." వేసినట్లు పేర్ని నాని తెలిపారు. 
 
ఇంకా పేర్నినాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంతర్గత అంశాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపట్టనున్నామని పేర్నినాని చెప్పారు. 
 
ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే నడిపే ఆలోచనలో ఉన్నాం. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతామని పేర్ని నాని వ్యాఖ్యానించారు.