ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (21:59 IST)

మొక్కజొన్న కంకిని తింటూ సరదాగా గడిపిన రోజా

RK Roja
RK Roja
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రోడ్డుపై మొక్కజొన్న తింటూ సరదాగా గడిపారు. వడమాల పేట మండలం కాయం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తూ ఎస్వీ పురం టోల్ గేట్ వద్ద రోడ్డుపై ఆగారు. 
 
ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు. 
 
మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.