గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (16:10 IST)

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

tgbharat
రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 
 
'వైకాపా ప్రభుత్వం న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసిందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టు తెలిపారు. 
 
బెంచ్‌ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చని, ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందన్నారు. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయనీ, కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైకాపా దుష్ప్రచారమేనని మంత్రి వెల్లడించారు.