శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (13:05 IST)

నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో బహిర్భూమి కోసం బయటకెళ్ళిన సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసి గ్రామ పెద్దలకు ఘటనపై ఫిర్యాదు చేశారు. 
 
అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత డబ్బు ఇస్తామని కామ్‌గా ఉండాలని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.