బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (20:39 IST)

చీపుర్లు మోసిన ఎమ్మెల్యే

చిల‌క‌లూరిపేట మండ‌లం కోమ‌టినేనివారిపాలెం అది. ఈ రోజు జ‌రిగిన స‌న్నివేశ‌మే ఇది. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు ఆ ఊరి ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. పండు ముదుస‌లి. 70 ఏళ్ల‌కు పైనే వ‌య‌సు ఉండొచ్చు. చీపుర్లు అమ్ముకుంటున్నాడు.

అప్పుడే అల్లిన ప‌చ్చిక చీప‌ర్లు అవి. గొడ్ల చావిడిలో ఊడ్చేందుకు వాడ‌తారు. ప‌చ్చి మీద ఉన్నాయి. ఆ వృద్ధుడి ప‌క్క‌నే చీపుర్ల మూట‌. 40 కేజీల దాకా బ‌రువుండొచ్చు. అప్ప‌టి దాకా నెత్తిన పెట్టుకుని మోసీ, మోసీ పాపం ఆ వృద్ధుడు అల‌సిపోయి ఉన్న‌ట్టున్నాడు. చెట్టుకు కింద అరుగు చూసి సేద‌తీరాల‌నుకున్నాడు కాబోలు.

చీపుర్ల మోపున ప‌క్క‌న‌బెట్టి చెట్టుకింద అరుగుపై కూర్చుని చుట్ట తాగుతూ సేద తీరుతున్నాడు. నెత్తిన చిన్న‌పాటి త‌ల‌పాగా. మాసిన గ‌డ్డం, మురికిప‌ట్టిపోయిన దుస్తులు. వ‌య‌సు మీద‌ప‌డి కూడా సంపాద‌న కోసం ఆ వృద్ధుడు ప‌డుతున్న త‌ప‌న చూస్తే ఎవ‌రికైనా పాపం అనిపించ‌క‌మాన‌దు.

కుటుంబంలో ఎన్ని క‌ష్టాలు ఉంటే... ఆ వృద్ధుడు ఆ వ‌య‌సులో అంత "క‌ష్టం మోస్తున్న‌ట్లు"! ఈ దృశ్యాన్ని గమ‌నించిన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని వెంట‌నే కారు ఆపారు. ఆ వృద్ధుడి వ‌ద్ద‌కు వెళ్లారు. అత‌డి క‌ష్టం తెలుసుకున్నారు.

తాతా.. పింఛ‌న్ వ‌స్తోందా.. అని అడిగారు. కొంత ఆర్థిక సాయం చేశారు. చీపుర్ల మోపును త‌ల‌పై పెట్టుకుని ఎమ్మెల్యే మురిసిపోయారు. ఆ వృద్ధుడికి కొంత సాంత్వ‌న చేకూర్చారు.