మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (21:45 IST)

ప్రజల నాడిని అలా పట్టేసిన ఆర్కే రోజా.. ఎలా?

సినీనటి గాను, రాజకీయ నేతగాను ఎమ్మెల్యే రోజా ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే వందల సినిమాల్లో నటించిన రోజాకు సినీరంగంలో మంచి పేరే ఉంది. రాజకీయ నాయకురాలిగా కూడా రోజాకు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. అలాంటి రోజా రాజకీయాల్లో మరింతగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
తన సొంత నియోజకవర్గం నగరిలో రోజా చురుగ్గా పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొంది తీరాలని నిర్ణయించుకున్నారు రోజా. అందుకే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ప్రారంభించారు. ప్రజలకు బాగా దగ్గరవుతున్నారు. 
 
రానున్నది వేసవి కాలం. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే నీళ్లు ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే అందరికీ నీటి అవసరాన్ని తీరుస్తున్నారు రోజా. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ తన సొంత డబ్బులతో బోర్లను వేయించి గ్రామస్తుల నీటి కష్టాన్ని తీరుస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా రోజా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. రోజాను ఆశీర్వదిస్తున్నారు.