గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 10 మార్చి 2022 (17:17 IST)

11 సంవత్సరాల నిరీక్షణ: పన్నూరు- పిలాస పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా వినతులు

అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ప్రజల అతి ప్రధాన, చిరకాల కోరిక అయిన పన్నూరు- పిలాసపాలెం రోడ్డు నిర్మాణానికి తను ఎమ్మేల్యేగా గెలిచిన నాటినుంచి రోజా ప్రయత్నిస్తున్నారు.

 
గురువారం నాడు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డిని కలిసి ఈ రోడ్డు ప్రాముఖ్యతను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి ఏప్రిల్ నెల మొదటి వారం లోగా ఖచ్చితంగా సరిపడా గ్రాంట్‌లో పెట్టీ మంజూరు చేయిస్తానని పూర్తి హామీ ఇచ్చినట్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు.