బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (11:12 IST)

సీమ చెల్లెమ్మ.. అత్తిలి చిన్నమ్మ.. అందరి స్లోగన్ ఒకటేరా.. సైకో పోవాలి...

buddha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు పరాభవం తప్పలేదు. ఎమ్మెల్యే కోటాతో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం పరాభవం తప్పలేదు. మొత్తం మూడు స్థానాల్లో రెండు టీడీపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో వైకాపా, టీడీపీల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ముఖ్యంగా, అధికార బలంతో పలు అక్రమాలకు పాల్పడినప్పటికీ వైకాపా అభ్యర్థులను పట్టభద్రులు చిత్తుగా ఓడించి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 
 
దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తనదైనశైలిలో స్పందించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల మూడో ఎలా ఉందో గ్రహించవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డికి బైబై చెప్పడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఫలితాలపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "సీమ చెల్లెమ్మ, అత్తిలి చిన్నమ్మ, శ్రీశైలం అమ్మమ్మ అందరి స్లోగన్ ఒకటేరా.. సేకో పోవాలి. సైకిల్ రావాలి" అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.