శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:42 IST)

ఎంపీ విజయసాయి ఇక ఢిల్లీకే ప‌రిమితం... ఆర్.ఆర్.ఆర్. వ్యాఖ్య‌

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే, ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు. 
 
పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తానని ఇలా ఆయన చెప్పడం ఇదే మొదటి సారి. ఇంత‌కాలం ర‌ఘురామ అంతా రివ‌ర్స్ పాలిటిక్స్ చేశారు. స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇపుడు స‌డ‌న్ గా ఆయ‌న వైఖ‌రిలో మార్పు వ‌చ్చిన‌ట్లుంది. తాను, విజ‌య‌సాయి క‌లిసి ఢిల్లీలో పార్టీ కోసం, సీఎం జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తామ‌ని చెప్ప‌డంలో అంత‌రార్ధం ఏమిట‌ని అంద‌రూ డైల‌మాలో ప‌డ్డారు.