గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (17:30 IST)

తాగుబోతుల తలకాయలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు: RRR

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైసీపీ సర్కార్‌‌పై ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తిరుమల నిధులపై గురిపెట్టిందని, వెంకన్ననూ వదలడం లేదని, ‘మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానని’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 
 
గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. స్వామి ఆస్తులను ముట్టుకోవద్దంటూ భక్తులందరూ కలిసి సీఎంకు వినతిపత్రం పంపిద్దామని రఘురామ పిలుపు ఇచ్చారు.
 
తాగుబోతుల తలకాయలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని చురకలు అంటించారు.. వెంకన్న ఆస్తులను ముట్టుకోవద్దు అంటూ  వెంకన్న భక్తులు అందరూ కూడా ముఖ్యమంత్రి కి వినతిపత్రం పంపిద్దామని తెలిపారు. ''మా దేవుడిని వదిలేయండి అని వేడుకుంటున్నా. అశోక్ గజపతి రాజును వెంటాడుతున్నారు.'' అని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.