మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:22 IST)

యువ‌త స్పీడ్ త‌గ్గించుకోవాలి... సాయి ధరమ్‌ తేజ్‌ కోలుకోవాలి...

బైక్ ల‌పై రైడింగ్ చేసేట‌పుడు యువ‌త స్పీడ్ త‌గ్గించుకోవాల‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి హిత‌వు ప‌లికారు. ఈ స్పీడ్ కార‌ణంగానే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
హైద‌రాబాదులో ఐకియా స‌మీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ హీరో సాయిధరమ్‌తేజ్‌ కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
 
‘‘యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని’’ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.