శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (11:56 IST)

అదనపు వరకట్న కోసం భార్యను బావిలో వేలాడదీసిన భర్త.. ఎక్కడ?

victim
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. అదనపు వరకట్నం కోసం భార్యను కిరాతకంగా వ్యవహరించాడు. భోపాల్‌లో ఓ వ్యక్తి కట్నం కోసం భార్యను వేలాడదీశారు. ఓ కిరాతక భర్త మూర్ఖంగా ప్రవర్తించిన తీరు చూసి స్థానికులు విస్తుపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎంపీలోని నీముచ్ జిల్లాకు చెందిన రాకేశ్ కిర్ అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించసాగాడు. రూ.5 లక్షల అదనపు కట్నం కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. 
 
ఈ క్రమంలోనే ఆమెను తాడుతో బావిలో వేలాడదీశాడు. భయంతో భార్య ఏడుస్తూ ఉండగా ఈ ఘటనను వీడియో తీసి ఆమె బంధువులకు షేర్‌ చేశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెను రక్షించాలంటూ అదే ప్రాంతంలోని కొందరిని సంప్రదించారు. చాలా సేపటి తర్వాత భార్యను బయటకు తీశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేశ్‌ను అరెస్టు చేశారు.