సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కృష్ణానది ఒడ్డున అనామకంగా నాగ ప్రతిమలు

naga prataimalu
కృష్ణానది ఒడ్డున అనామకంగా అనేక నాగ ప్రతిమలు కనిపించాయి. సీతానగరం సమీపంలోని నది ఒడ్డున స్థానికులు వీటిని గుర్తించారు. ఈ నాగ ప్రతిమలు పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నాగ ప్రతిమల అనామకంగా కనిపించడం వెనుక ఉన్న వాస్తవం ఏంటో లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లా కృష్ణా నది తీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో ఈ నాగ ప్రతిమలు వెలుగు చూశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయే తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. 
 
కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న కోరణంలోనూ వారు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాలు నాగ ప్రతిమలు కావడంత దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీ తీరాన వదిలి వెళ్లివుంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న గుట్టును బహిర్గతం చేయాలని వారు కోరుతున్నారు.