శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (15:00 IST)

తెలుగు మహా సభలకు ముఖ్య అతిథిగా నాగాలాండ్ గవర్నర్ ఇల.గణేశన్

gazal
ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "అంధ్రమేవ జయతే" అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తెలుగు మహాసభలు జరుగనున్నాయి. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. 
 
ఈ అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ ఇల.గణేశన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే" సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంధ్ర వాజ్ఞ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.