శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (17:10 IST)

కుమారుడుపై ప్రేమతో.... ప్రాణం తీసిన 'ఆ' సిరీస్ నంబర్

సినీ హీరో, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు పెద్ద కుమారుడు జానకిరామ్ అంటే అమితమైన ప్రేమ. మిగిలిన ఇద్దరు కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల కంటే కూడా జానకిరామ్ అంటే మహాయిష్టం.

సినీ హీరో, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు పెద్ద కుమారుడు జానకిరామ్ అంటే అమితమైన ప్రేమ. మిగిలిన ఇద్దరు కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల కంటే కూడా జానకిరామ్ అంటే మహాయిష్టం. అందుకే జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అతని కారు నంబరుతోనే తన కొత్త కారుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు హరికృష్ణ. ఇపుడు ఆ నంబరే హరికృష్ణ ప్రాణాలు తీసిందని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
 
గత 2014లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ కన్నుమూశారు. ఆయన ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323. కుమారుడు మరణించిన తర్వాత అతనిపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఏపీ28 బీడబ్ల్యూ 2323 పేరుతో ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఉండొచ్చనే సందేహం వ్యక్తమవుతోంది. 
 
ఇదిలావుంటే, తండ్రీకొడుకులిద్దరూ అదే నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడం వల్ల మరణించడంతో అభిమానులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెల్సిందే. దీంతో నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు అదీ కూడా నల్గొండ జిల్లాలోనే ఎందుకిలా వెంటాడుతున్నాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.