గురువారం, 7 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 19 మే 2016 (11:23 IST)

వాయుగుండం ప్రభావం.. నెల్లూరు, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గత రెండురోజుల నుండి భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు, తడ, ఆత్మకూరు, సూళ్లూరుపేట ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. 
 
నెల్లూరు నగరంలో లోతట్టుప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. శుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో తుఫాను మరింత బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశాలలో గురు, శుక్రవారాల్లో భారీగావర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.