మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ఏపీలో జిల్లాలకు కొత్త ఇంచార్జ్ మంత్రులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇప్పటివరకూ జిల్లా ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్న మంత్రులకు కొందరికి స్థాన చలనం కల్పించిగా, మరికొందరికి కొత్తగా అవకాశం కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఆయా జిల్లాల వారీగా ఇంచార్జ్‌ మంత్రులను నియమించింది. 13 జిల్లాలకు 13 మంది మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
జిల్లాల వారీగా ఇంచార్జ్‌ మంత్రుల వివరాలు 
 
శ్రీకాకుళం - కొడాలి నాని
విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం - కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ
పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య
కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు
ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి
కర్నూలు - అనిల్‌ కుమార్‌ యాదవ్‌
వైఎస్‌ఆర్‌ కడప - ఆదిమూలపు సురేష్‌
అనంతపురం - బొత్స సత్యనారాయణ
చిత్తూరు - మేకపాటి గౌతమ్‌ రెడ్డి