మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (19:22 IST)

రాజధాని అంశంలో జోక్యం చేసుకోం: కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో జోక్యం చేసుకోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని తేల్చిచెప్పింది. 
 
ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు కేంద్రం తెలియజేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందిస్తూ మరోసారి తమ వైఖరిని వెల్లడించింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉందని పేర్కొంది. 
 
ఈ మేరకు హైకోర్టులో బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ  సందర్భంగా ఈ అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సమర్పించింది.

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.