గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (12:43 IST)

అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు ఆసక్తి చూపని జగన్ సర్కారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో కొత్త రైల్వే ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సర్కారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అమరావతి రైల్వేలైన్‌‌ ప్రాజెక్టుపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. 
 
అమరావతి రైల్వేలైన్‌ ఖర్చు పంచుకోవడానికి కూడా ఏపీ సిద్ధంగా లేదని కేంద్రం తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. అందుకే ఒక్క అమరావతి రైల్వే లైను మాత్రమేకాకుండా విభజన హామీలన్నింటినీ పక్కనెట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 
 
మరోవైపు.. తెలంగాణలోనూ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అనవసరమని కేంద్రం తేల్చింది. ఈ ప్రకటనలతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోతొక్కినట్టయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ తేల్చిచెప్పడం గమనార్హం.
 
నిజానికి విభజన హామీల్లో ఒకటి అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు. ఈ రైల్వే ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్‌ లైన్‌ను ప్రతిపాదించారు. కృష్ణాజిల్లా పెద్దాపురం మీదుగా చిన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, నంబూరుల వరకు ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. 
 
అమరావతి నుంచి తిరిగి పెదకూరపాడువరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కిలోమీటర్లు సింగిల్‌ లైన్లకు కూడా అప్పట్లో ప్రతిపాదించారు. కానీ, ఈ లైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అదేఅదనుగా భావించిన కేంద్రం...