సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 6 జులై 2020 (20:35 IST)

టోకెన్ కౌంటర్లు ఖాళీ, తిరుమల భక్తులు నిల్, ఏమైంది?

మూడు నెలల గ్యాప్ తరువాత మళ్ళీ తిరుమల శ్రీవారి దర్సనం ప్రారంభమైంది. ఇక భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే ఆన్లైన్ లోను, సాధారణంగా కౌంటర్ల ద్వారా టోకెన్లను అందించారు.
 
కౌంటర్లలో టోకెన్లను పొందేందుకు జనం బారులు తీరి కనిపించారు. ఇదంతా గత నెల 10వ తేదీ నుంచి జరిగింది. అయితే సరిగ్గా మూడు రోజుల నుంచి టోకెన్లు తీసుకునే భక్తులు కరువయ్యారు. పూర్తిగా కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
 
భక్తులు లేరు. స్థానికులే ఆధార్ కార్డులు చూపించి టోకెన్లను పొందుతున్నారు. రేపటి దర్సనానికి ముందు రోజే టోకెన్లు ఇస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం కరోనా వైరస్ వ్యాపిస్తోందని.. టిటిడి ఉద్యోగులకే కరోనా సోకుతోందన్న ప్రచారం బాగా జరగడమని భావిస్తోంది టిటిడి.
 
అయితే భక్తుల వల్ల కరోనా వ్యాప్తి చెందడం లేదని... టిటిడిలో పనిచేసే 17మంది ఉద్యోగులకు మాత్రమే కరోనా సోకిందని స్వయంగా టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇది కాస్త ఇంకా బాగా ప్రచారం జరగడంతో భక్తుల రద్దీ తగ్గుతున్నట్లు టిటిడి అధికారులు భావిస్తున్నారు.