ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (17:26 IST)

ఎంతగా అరిచి గీపెట్టినా ప్రత్యేక హోదా ఇవ్వం : తేల్చిచెప్పిన కేంద్రం

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీనే అమలు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీనే అమలు చేస్తామని జైట్లీ పునరుద్ఘాటించినట్టు సమాచారం. 
 
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలోని రాష్ట్ర బృందం సోమవారం రాత్రి భేటీ అయింది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ తన మనసులోని మాటను వెల్లడించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమలేమని తేల్చి చెప్పింది. అయితే, ప్రత్యేక ప్యాకేజీకి మాత్రమే కట్టుబడి వుంటామని తెలిపారు. అదేసమయంలో ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, ఇప్పటికే 12500 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదని జైట్లీ ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పనిలోపనిగా ఆయన కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేసినట్టు వినికిడి. 
 
ఇపుడు తెలుగు సెంటిమెంట్ పేరుతో ఏపీ రాజకీయ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనీ, ఇపుడు ఈ డిమాండ్లకు తలొగ్గితే రేపు తమిళ, కన్నడం, మలయాళం అంటారనీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.